రంగారెడ్డి జిల్లాలో బిఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

BRS లో చేరిన NSUI నాయకులు.

రంగారెడ్డి జిల్లా NSUI ఉపాధ్యక్షుడు అభిశేఖ్ ఆద్వర్యంలో రాజేంద్ర నగర్, చేవెళ్ల, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలనుంచి పలువురు NSUI నాయకులు, BRS పార్టీ యువనాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి గారి సమక్షంలో BRS పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ, మార్పు మొదలైంది వలసలు పెరుగుతాయని తెలిపారు. ఇచ్చిన హామీలు విస్మరిస్తూ కేవలం రాజకీయాలకు మాత్రమే యువతను వాడుకున్నారని ఆరోపించారు. కొంతమంది MLAలు, నాయకులు స్వార్థంకోసం పార్టీలు మారుతుంటే యువత మాత్రం KCR వెంటే నడవాలని నిర్ణయించుకుంటున్నారు.
కార్యక్రంలో భాగంగా BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ, 
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువత బతుకులు బాగుపడతాయని బోగస్ హామీలిచ్చి యువతను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ. విద్యార్థులను రాజకీయాలకు మాత్రమే వాడుకుని నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. NSUI నుంచి BRSV లో చేరుతున్న విద్యార్థి నాయకులందరికీ సముచిత న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 
ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేస్తారని ఆశించిన యువత అంతా కూడా ఆందోళనలో ఉంది, యావత్ తెలంగాణ యువత నిరాశలో ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి KCR మాత్రమే శ్రీరామరక్ష, రానున్న రోజుల్లో పెద్దసంఖ్యలో చేరికలు జరుగుతాయని NSUI నాయకులు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments